Kangana Ranaut: రోజా అంటే ఎవరో తనకు తెలియదన్న కంగనా రనౌత్

I dont know who is Roja says Kangana Ranaut
  • రాజకీయాల్లోకి వస్తే సినిమాలు వదులుకోవాలంటూ పవన్ ను ఉద్దేశించి రోజా వ్యాఖ్యలు
  • రోజా కామెంట్స్ ను కంగనా వద్ద ప్రస్తావించిన మీడియా
  • తనకు తెలియని రోజా గురించి ఏం మాట్లాడతానన్న కంగనా

సినీ నటి, ఏపీ మంత్రి రోజాపై బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. రాజకీయాల్లోకి వస్తే సినిమాలను వదులుకోవాలంటూ జనసేనాని పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి రోజా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలను కంగన వద్ద మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా... రోజా అంటే ఎవరు? అని ఆమె ఎదురు ప్రశ్న వేశారు. ఆమె ఎవరో తనకు తెలియనప్పుడు... ఆమె గురించి తాను ఏం మాట్లాడతానని అన్నారు. రాజకీయాల్లో తనకు అవకాశం వస్తే తాను వదులుకోనని చెప్పారు. తనకు దేశ భక్తి చాలా ఎక్కువని... అందుకే పేదలకు తనకు తోచిన సాయం చేస్తున్నానని తెలిపారు. ఇండియా పేరును భారత్ గా మార్చాలని తాను రెండేళ్ల క్రితమే చెప్పానని అన్నారు.

  • Loading...

More Telugu News