ram potineni: రామ్–బోయపాటి స్కంద వెనక్కి.. సలార్‌‌ టైమ్‌కి విడుదల

SKANDA will now release on 28 Sept 2023
  • ఈ నెల 15న విడుదల కావాల్సిన స్కంద
  • ప్రభాస్ సలార్‌‌ వాయిదా పడటంతో వెనక్కి జరిపిన చిత్ర బృందం
  • ఈ నెల 28న స్కందను విడుదల చేస్తున్నట్టు ప్రకటన

యువ హీరో రామ్ పోతినేని–బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘స్కంద’. బాలకృష్ణతో ‘అఖండ’తో మంచి విజయం సాధించిన శ్రీను మరోసారి తన మార్కు మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్‌‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్యాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమాను పలు భాషల్లో ఈనెల 15న విడుదల చేయనున్నట్టు ఇదివరకే ప్రకటించారు. ఆడియో, ప్రీ రిలీజ్‌ వేడుకను కూడా ఘనంగా నిర్వహించారు. అయితే, ఈ సినిమా విడుదల తేదీ మారింది. 

రెబల్ స్టార్ ప్రభాస్–ప్రశాంత్ నీల్ చిత్రం సలార్ వాయిదా పడటంతో ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకునేందకు స్కంద రిలీజ్ డేట్‌ను వెనక్కు జరిపారు. ‘సలార్’ రిలీజ్ అవ్వాల్సిన ఈ నెల 28వ తేదీన స్కందను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. శ్రీలీల, సయీ మంజ్రేకర్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించాడు.

  • Loading...

More Telugu News