ఏక్ ధమ్, ఏక్ ధమ్ నచ్చేశావే.. ఎల్లాకిల్లా పడేశావే అంటున్న రవితేజ
- రవితేజ హీరోగా నటించిన ‘టైగర్ నాగేశ్వరరావు’
- తొలి పాట విడుదల చేసిన చిత్ర బృందం
- అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమా
‘ఏక్ ధమ్, ఏక్ ధమ్ నచ్చేశావే.. ఎల్లాకిల్లా పడేశావే’అంటూ సాగే పాటలో హీరో రవితేజ.. హీరోయిన్ నుపూర్ సనన్‌ని ఆట పట్టిస్తూ కనిపించాడు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి పాడాడు. భాస్కరభట్ల రవికుమార్ సాహిత్యం అందించాడు. కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశాడు. కాగా, ఈ చిత్రం దసరా కానుకగా పలు భాషల్లో అక్టోబర్ 20న విడుదల కానుంది.