Raghav Chadha: పరిణీతి, రాఘవ్ ల పెళ్లికి ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే?

Raghav Chadha And Parineeti Chopra to get married in Udaipur on September 25
  • ఉదయ్ పూర్ లో ఈ నెల 25న వివాహం!
  • ఈ నెల 17 నుంచి మొదలుకానున్న వేడుకలు
  • అతిథుల కోసం లగ్జరీ హోటల్స్ బుక్ చేస్తున్న ఢిల్లీ ఎంపీ
బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఢిల్లీ ఎంపీ రాఘవ్ చద్దాల వివాహానికి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ నెల 25న రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో ఈ సెలబ్రెటీ జంట మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కానుందని సమాచారం. పెళ్లి ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయని, అతిథుల కోసం ఈ జంట లగ్జరీ హోటళ్లలో రూమ్స్ బుక్ చేస్తున్నారని తెలిసింది. ఈ నెల 17 నుంచే వివాహ వేడుకలు ప్రారంభం కానున్నాయని ఎంపీ రాఘవ్ చద్దా సన్నిహితులు చెబుతున్నారు.

పరిణీతి, రాఘవ్ లకు మే 13న ఎంగేజ్ మెంట్ జరిగిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని రాఘవ్ చద్దా నివాసంలో అత్యంత సన్నిహితుల మధ్య ఈ కార్యక్రమం జరిగింది. అప్పటి నుంచి వీరి వివాహ వేడుకకు సంబంధించి రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. నవంబర్ లో వీరి వివాహం జరగనుందని వార్తలు వెలువడ్డాయి. తాజాగా ఈ జంట ఉదయ్ పూర్ కు వెళ్లింది. అక్కడ పెళ్లి ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించినట్లు సమాచారం. ఇందులో భాగంగా అతిథుల కోసం హోటల్ రూమ్స్ బుక్ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు, ఉదయ్ పూర్ పోలీసులు సెక్యూరిటీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంపీ పెళ్లికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సహా వీవీఐపీలు హాజరయ్యే అవకాశం ఉందని సెక్యూరిటీ పటిష్ఠం చేశారు.
Raghav Chadha
Parineeti Chopra
marriage
Udaipur
September 25

More Telugu News