9999: హైదరాబాద్ లో భారీ ధరకు 9999 ఫ్యాన్సీ నంబర్.. ఆ డబ్బుతో ఇంకో కారు కొనుక్కోవచ్చు!

9999 fancy number in Hyderabad
  • రూ. 9,99,999 ధర పలికిన టీఎస్ 11 ఈజడ్ 9999 నెంబర్
  • హైదరాబాద్ ఈస్ట్ జోన్ పరిధిలో ఫ్యాన్సీ నంబర్ల బిడ్డింగ్
  • ఆర్టీఏ ఖజానాకు రూ. 18 లక్షల ఆదాయం

హైదరాబాద్ ఈస్ట్ జోన్ పరిధిలో నిన్న ఫ్యాన్సీ నంబర్ల బిడ్డింగ్ పోటాపోటీగా జరిగింది. బిడ్డింగ్ ద్వారా ఆర్టీఏ ఖజానాకు రూ. 18 లక్షల ఆదాయం సమకూరింది. టీఎస్ 11 ఈజడ్ 9999 నంబర్ రూ. 9,99,999కి అమ్ముడుపోయింది. ఈ నంబర్ ను భారీ ధరకు చర్చ్ ఎడ్యుకేషనల్ సొసైటీ దక్కించుకుంది. బిడ్డింగ్ లో ఈ నంబర్ కు కళ్లు చెదిరే ధర పలకడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ డబ్బుతో మరో కారు కొనుక్కోవచ్చని వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు టీఎస్ 11 ఎఫ్ఏ 0001 నంబర్ ను కామినేని సాయి శివనాగు అనే వ్యక్తి రూ. 3.50 లక్షలకు సొంతం చేసుకున్నారు. టీఎస్ ఎఫ్ఏ 0011 నెంబర్ ను శ్యామల రోహిత్ రెడ్డి రూ. 1.55 లక్షలకు దక్కించుకున్నారు.   

  • Loading...

More Telugu News