USA: గ్రీన్ కార్డ్ వెయిటింగ్.. తల్లిదండ్రులకు దూరం కానున్న భారత సంతతి పిల్లలు

1 lakh 34 Thousand Indians in US risk being separated from parents
  • 21 ఏళ్లు నిండిన వెంటనే అమెరికా వీడాల్సిందే
  • ముప్పు ముంగిట 1.34 లక్షల మంది యువత
  • హెచ్ 4 కేటగిరీ వీసాల ప్రాసెసింగ్ కు భారీగా వెయిటింగ్
అమెరికాలో తాత్కాలిక వీసాతో ఉంటున్న భారత సంతతి తల్లిదండ్రులు తమ పిల్లలకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. హెచ్ 1 బీ వీసాతో అమెరికాలో ఉద్యోగం చేస్తున్న వారు ఈ ముప్పును ఎదుర్కొంటున్నారు. ఈ వీసా హోల్డర్ల పిల్లలకు అమెరికా హెచ్ 4 వీసా జారీ చేస్తుంది. వారు 21 ఏళ్లు వచ్చే వరకు అమెరికాలో తల్లిదండ్రులతో కలిసి ఉండవచ్చు. ఈ లోపు గ్రీన్ కార్డ్ వస్తే శాశ్వతంగా నివసించే హక్కు లభిస్తుంది. లేదంటే అమెరికా వదిలి వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుతం హెచ్ 4 వీసా ప్రాసెసింగ్ కు వెయిటింగ్ పీరియడ్ చాలా ఎక్కువగా ఉందని అమెరికాలోని భారత సంతతి తల్లిదండ్రులు చెబుతున్నారు. 

హెచ్ 1 బీ వీసాతో అమెరికాలో పనిచేస్తున్న భారతీయుల సంఖ్య లక్షల్లో ఉందని ఇమిగ్రేషన్ అధికారులు తెలిపారు. వారితో పాటు హెచ్ 4 వీసాతో ఉంటున్న పిల్లలు కూడా అదే సంఖ్యలో ఉంటారని అంచనా. ఇందులో 21 ఏళ్లకు చేరువైన యువత 1.34 లక్షల మంది.. ప్రస్తుతం వీరంతా డిపోర్టేషన్ (దేశం నుంచి పంపించివేసే ప్రక్రియ) ముప్పు ఎదుర్కొంటున్నారు. అమెరికాలో ఇప్పుడున్న నిబంధనల ప్రకారం వీరందరికీ గ్రీన్ కార్డు రావాలంటే కనీసం 135 ఏళ్లు పడుతుందని అంచనా. దీనిపై గతకొంతకాలంగా అమెరికాలో ఆందోళనలు జరుగుతున్నాయి. భారత సంతతి యువతతో పాటు ఇతర దేశాలకు చెందిన యువత కూడా ఈ సమస్యపై ఆందోళన చేస్తున్నారు.
USA
indians in usa
parents
H4 visa
Deportation
Green card

More Telugu News