Shahrukh Khan: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న షారుఖ్ ఖాన్

Bollywood star Shahrukh khan visits Tirumala temple for darshan
  • భార్య, కుమార్తె, నటి నయనతారతో కలిసి తిరుమలకు వచ్చిన షారూఖ్ ఖాన్
  • ఉదయం స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొన్న వైనం
  • రంగనాయకుల మండపంలో పండితులు షారూఖ్‌కు వేదాశీర్వచనం, తీర్థప్రసాదాలు
  • ఈ నెల7న జవాన్ విడుదల కానుండటంతో తిరుమల విచ్చేసిన షారుఖ్
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ తన కుటుంబంతో కలిసి నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. భార్య గౌరీ ఖాన్‌, కుమార్తె సుహానా ఖాన్, నటి నయనతారతో కలిసి ఆయన సుప్రభాత సేవలో పాల్గొన్నారు. తొలుత దేవస్థానం అధికారులు షారుఖ్‌కు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆ తరువాత షారుఖ్ గర్భాలయంలో వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆ తరువాత పండితులు షారుఖ్‌కు రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం ఇచ్చి, స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. షారుఖ్ నటించిన ‘జవాన్’ చిత్రం ఈ నెల 7న విడుదల కానుండటంతో ఆయన తిరుమలకు వచ్చారు.
Shahrukh Khan
Tirumala
Andhra Pradesh
Bollywood
Nayanthara

More Telugu News