Team India: టీమిండియా చేజింగ్ కు వర్షం అంతరాయం

Rain interrupts Team India chasing in Asia Cup league match
  • ఆసియా కప్ లో భారత్, నేపాల్ ఢీ
  • మొదట బ్యాటింగ్ చేసి 48.2 ఓవర్లలో 230 పరుగులకు నేపాల్ ఆలౌట్
  • 2.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 17 పరుగులు చేసిన భారత్
  • వర్షం రావడంతో నిలిచిన మ్యాచ్
ఆసియా కప్ లో భారత్ ఆడే మ్యాచ్ లకు వాన బెడద తప్పడంలేదు. ఇవాళ శ్రీలంకలోని పల్లెకెలె మైదానంలో నేపాల్ తో జరుగుతున్న మ్యాచ్ లోనూ వరుణుడు ఆటంకం కలిగించాడు. నేపాల్ బ్యాటింగ్ సమయంలో ఓసారి వర్షం పడడంతో గంటపాటు మ్యాచ్ నిలిచిపోయింది. ఆ తర్వాత టీమిండియా లక్ష్యఛేదన సమయంలోనూ వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయింది. టీమిండియా టార్గెట్ 231 పరుగులు కాగా... మ్యాచ్ ఆగిపోయే సమయానికి టీమిండియా 2.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 17 పరుగులు చేసింది. ఓపెనర్లు శుభ్ మాన్ గిల్ 12, రోహిత్ శర్మ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు.
Team India
Chasing
Rain
Nepal
Asia Cup

More Telugu News