Chandana Bauri: రోడ్డు నిర్మాణ పనుల్లో చెమటోడ్చిన బీజేపీ ఎమ్మెల్యే, ఆమె భర్త... వీడియో పంచుకున్న విష్ణువర్ధన్ రెడ్డి

Vishnu Vardhan Reddy shares a video of BJP MLA Chandana Bauri and her husband built a road
  • పశ్చిమ బెంగాల్ లో ఘటన
  • టీఎంసీ సర్కారు రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకుందన్న విష్ణు
  • దాంతో బీజేపీ ఎమ్మెల్యే చందనా బౌరి స్వయంగా రోడ్డు వేశారని వెల్లడి
  • రోడ్డు నిర్మాణ ఖర్చు కూడా ఆమే భరించిందని వివరణ
బీజేపీ ఏపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి సోషల్ మీడియాలో ఆసక్తికర వీడియో పంచుకున్నారు. ఆ వీడియోలో, ఓ బీజేపీ మహిళా ఎమ్మెల్యే, ఆమె భర్త రోడ్డు నిర్మాణ పనుల్లో పాలుపంచుకోవడాన్ని చూడొచ్చని వెల్లడించారు. 

"ఈ వీడియోలో కనిపిస్తున్న మహిళ పేరు చందనా బౌరి. ఆమె పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బీజేపీ ఎమ్మెల్యే. ఆమె నియోజకవర్గంలో రోడ్డు నిర్మాణాన్ని తృణమూల్ ప్రభుత్వం అడ్డుకుంది. దాంతో, ఆమె తన భర్తతో కలిసి 200 మీటర్ల రోడ్డు నిర్మాణాన్ని చేపట్టారు. స్వయంగా చెమటోడ్చి పనిచేశారు. ఆ రోడ్డు నిర్మాణానికి అయిన ఖర్చు కూడా వారిదే. తన ప్రజలకు సేవ చేయాలన్న ఆమె అచంచల అంకితభావానికి ఇది నిదర్శనం" అని విష్ణువర్ధన్ రెడ్డి కొనియాడారు.
Chandana Bauri
BJP MLA
West Bengal
Road
TMC Govt
Vishnu Vardhan Reddy
BJP
Andhra Pradesh

More Telugu News