Renuka Chowdary: ఏపీ నేతలకు తెలంగాణలో ఏం పని?: షర్మిలపై రేణుకా చౌదరి వ్యాఖ్యలు

Renuka Chowdary take a jibe at Sharmila
  • షర్మిల పాలేరు నుంచి పోటీచేస్తాననడంపై రేణుక ఫైర్
  • అధిష్ఠానం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదన్న రేణుక
  • షర్మిల ముందు అమరావతి రైతుల గురించి మాట్లాడాలని వ్యాఖ్యలు
  • తాను ఏపీ కోడల్ని అని రేణుక వెల్లడి

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ నేత రేణుకా చౌదరి ధ్వజమెత్తారు. ఖమ్మం జిల్లా పాలేరులో షర్మిల పోటీ చేస్తాననడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిల తెలంగాణలో పోటీ చేసే విషయంలో అధిష్ఠానం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని అన్నారు.  

తెలంగాణ కోడలు అని షర్మిలకు ఇప్పుడు గుర్తొచ్చిందా? అంటూ ఎత్తిపొడిచారు. ఏపీ నేతలకు తెలంగాణలో ఏం పని? అంటూ సూటిగా ప్రశ్నించారు. ముందు అమరావతి రైతుల గురించి షర్మిల మాట్లాడాలని స్పష్టం చేశారు. ఇక, తాను ఏపీ కోడల్ని అని, తెలంగాణ ఆడబిడ్డను అని రేణుక వెల్లడించారు.

  • Loading...

More Telugu News