Raghunandan Rao: పార్టీ మార్పు వార్తలపై స్పందించిన రఘునందన్ రావు

Raghunandan Rao responds on Party changes news
  • తాను దుబ్బాక నుండి, బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని స్పష్టీకరణ
  • అధిష్ఠానం ఆదేశిస్తే ఎక్కడి నుండైనా పోటీకి సిద్ధమని వ్యాఖ్య
  • గజ్వేల్‌ను పరిశీలించేందుకు వెళ్తే అరెస్ట్ చేశారని ఆగ్రహం
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాను తన నియోజకవర్గం నుండే పోటీ చేస్తానని బీజేపీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు స్పష్టం చేశారు. అయితే పార్టీ ఆదేశిస్తే ఎక్కడి నుండి అయినా పోటీకి సిద్ధమని చెప్పారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతోన్న ప్రచారాన్ని ఖండించారు. తాను ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారేది లేదని, రానున్న ఎన్నికల్లో బీజేపీ నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు.

అదే సమయంలో కేసీఆర్ పాలనపై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ గత పదేళ్లలో గజ్వేల్ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలన్నారు. ఇక్కడ ఏం చేశారో చూద్దామని తాము భావిస్తే ముందు రోజే తమను అరెస్ట్ చేసి బిచ్కుంద పోలీస్ స్టేషన్‌కు తీసుకు వెళ్లారన్నారు. తమపై ఎలాంటి కేసులు పెట్టలేదని, కామారెడ్డి నుండి బస్సుల్లో గజ్వేల్‌కు వస్తే భయం ఎందుకన్నారు. ఇప్పుడు తమను అడ్డుకున్నారని, కానీ తాము ఏదో ఒకరోజు సమయం చూసుకొని తేదీ చెప్పకుండా గజ్వేల్ వస్తామని, అక్కడ బస్టాండ్ ఎలా ఉంది? డబుల్ బెడ్రూం ఇళ్లు ఎలా ఉన్నాయి? పరిశీలిస్తామన్నారు. ఎప్పుడూ బీఆర్ఎస్ మాత్రమే అధికారంలో ఉండదని తెలుసుకోవాలన్నారు.
Raghunandan Rao
BJP
dubbak

More Telugu News