Udayanidhi Stalin: ఇతడు తమిళనాడు సీఎం కొడుకు... సనాతన ధర్మాన్ని దోమతో పోల్చాడు: విష్ణువర్ధన్ రెడ్డి

Vishnu Vardhan Reddy fires on Udayanidhi Stalin
  • సనాతన ధర్మంపై ఉదయనిది వ్యాఖ్యలు
  • వీడియో పంచుకున్న బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి
  • ఉదయనిధి నరమేధం చేయమంటున్నాడని విమర్శలు

తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. ఉదయనిధి వ్యాఖ్యల వీడియోను విష్ణువర్ధన్ రెడ్డి తన 'ఎక్స్' అకౌంట్లో పంచుకున్నారు. 

"ఇతడు ఉదయనిధి స్టాలిన్... తమిళనాడు సీఎం, ఇండియా కూటమి నేత ఎంకే స్టాలిన్ కుమారుడు. అతడు ఏమంటున్నాడో వినండి. సనాతన ధర్మం ఓ దోమ వంటిదట. సనాతన ధర్మం డెంగీ, ఫ్లూ, మలేరియా లాగా ప్రమాదకరమైందట. అందుకే సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటున్నాడు. అతడు చెబుతున్న దాన్ని బట్టి  చూస్తే... దేశంలో 80 శాతం జనాభాను మూకుమ్మడిగా చంపేయాలంటున్నాడు. ఇలాంటి వాళ్లతో  కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంది. దీనిపై వాళ్లకేమంత అభ్యంతరం ఉన్నట్టు లేదు. ఎందుకంటే వాళ్ల 'ప్రేమ దుకాణం' నిజస్వరూపం ఇదే గనుక" అంటూ విష్ణువర్ధన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు.

  • Loading...

More Telugu News