IND Vs Pak: భారత్ - పాకిస్థాన్ మ్యాచ్ ను అడ్డుకున్న వర్షం

Rain stopped India Vs Pakistan match
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ను ఎంచుకున్న భారత్
  • 4.2 ఓవర్ల వద్ద మ్యాచ్ ను అడ్డుకున్న వర్షం
  • 11 పరుగులు చేసిన రోహిత్ శర్మ
ఆసియా కప్ లో భాగంగా శ్రీలంకలోని పల్లెకెలెలో జరుగుతున్న మ్యాచ్ ను వరుణుడు అడ్డుకున్నాడు. వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోయింది. అంతకు ముందు టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ ఇన్నింగ్స్ ను ఓపెన్ చేశారు. 4.2 ఓవర్ల వద్ద మ్యాచ్ కు వర్షం విఘాతం కలిగించింది. వర్షం ప్రారంభం కావడంతో గ్రౌండ్ స్టాఫ్ మైదానాన్ని కవర్లతో కప్పేశారు. మ్యాచ్ ఆగిపోయే సమయానికి టీమిండియా 4.2 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 15 పరుగులు చేసింది. 18 బంతులను ఎదుర్కొన్న రోహిత్ శర్మ 2 ఫోర్ల సాయంతో 11 పరుగులు చేశాడు. 8 బంతులను ఎదుర్కొన్న గిల్ ఇంకా ఖాతాను ప్రారంభించలేదు. ఎక్స్ ట్రాల రూపంలో 4 పరుగులు వచ్చాయి. 

IND Vs Pak
Asia Cup
Team India
Pakistan

More Telugu News