Pragyan Rover: చంద్రుడిపై శివశక్తి పాయింట్ నుంచి 100 మీటర్లు ప్రయాణించిన ప్రజ్ఞాన్ రోవర్: ఇస్రో

Pragyan rover moved more than 100 meters on moon
  • చంద్రుడిపై విజయవంతంగా పని చేస్తున్న విక్రమ్, ప్రజ్ఞాన్   
  • ముగుస్తున్న 14 రోజుల పగటి సమయం
  • రోవర్, ల్యాండర్ లను నిద్రాణ స్థితిలోకి చేర్చే ప్రక్రియను ప్రారంభించనున్న ఇస్రో

చంద్రయాన్-3కి చెందిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ లు చంద్రుడిపై తమ పనిని విజయవంతంగా కొనసాగిస్తున్నాయి. రోవర్ ఇప్పటి వరకు చంద్రుడిపై దిగిన శివశక్తి పాయింట్ నుంచి 100 మీటర్లకు పైగా ప్రయాణించిందని, ఇంకా ప్రయాణాన్ని కొనసాగిస్తోందని ఇస్రో ప్రకటించింది. ఇప్పటికే చంద్రుడి ఉపరితలంపై ఉష్ణోగ్రత, వివిధ మూలకాల సమాచారం, చంద్రుడిపై ప్రకంపనల వంటి సమాచారాన్ని ప్రజ్ఞాన్ రోవర్ చేరవేసిన సంగతి తెలిసిందే. మరోవైపు, చంద్రుడిపై ఒక్క పగలు అంటే మనకు 14 రోజులు అనే విషయం తెలిసిందే. దీంతో ఒక్క పగలు సమయం గడుస్తున్న తరుణంలో ఇస్రో అప్రమత్తమయింది. జాబిల్లిపై రాత్రిని తట్టుకునేందుకు వీలుగా రోవర్, ల్యాండర్ లను నిద్రాణ స్థితిలోకి చేర్చే ప్రక్రియను ప్రారంభించబోతోంది.

  • Loading...

More Telugu News