Pawan Kalyan: పవన్ కల్యాణ్ సీఎం కావాలని మోకాళ్లపై ఆదోని కొండ ఎక్కిన మహిళ... వీడియో ఇదిగో!

 Woman climbs Adoni Ranamandala hill seeking Pawan Kalyan as next CM
  • నేడు పవన్ కల్యాణ్ పుట్టినరోజు
  • పవన్ కోసం ఎంతో శ్రమపడిన మహిళ
  • మోకాళ్లపై 501 మెట్లు ఎక్కిన వైనం
  • పవన్ సీఎం కావాలని రణమండల ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు
జనసేనాని పవన్ కల్యాణ్ ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. సోషల్ మీడియాలోనూ, వెలుపలా పవన్ పై శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి కావాలంటూ ఓ మహిళ మోకాళ్లపై ఆదోని కొండ ఎక్కింది. 

కర్నూలు జిల్లా ఆదోనిలో రణమండల ఆంజనేయస్వామి ఆలయం చాలా ప్రసిద్ధికెక్కింది. ఇక్కడి హనుమంతుడ్ని ఏదైనా కోరుకుంటే తప్పకుండా నెరవేరుతుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఈ ఆలయం ఓ కొండపై కొలువై ఉంది. కాగా, సదరు మహిళ పవన్ కు వీరాభిమాని, జనసేనకు గట్టి మద్దతుదారు. ఆమె రణమండల హనుమాన్ ఆలయం వద్దకు చేరుకునేందుకు మోకాళ్లపై 501 మెట్లు ఎక్కింది. పవన్ కల్యాణ్ సీఎం కావాలన్నదే ఆమె ఆకాంక్ష. ఆ మేరకు ఆలయంలో ప్రత్యేక పూజలు చేసింది. 

దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది. ఎంతో కష్టమైనప్పటికీ  ఆమె మోకాళ్లపై కొండ ఎక్కిన తీరు పవన్ అభిమానులను ఆకట్టుకుంటోంది.
Pawan Kalyan
Birthday
Woman
Ranamandala Hanuan Temple
Adoni
Chief Minister
Janasena
Andhra Pradesh

More Telugu News