Dharman Shanmugaratnam: సింగపూర్ దేశాధ్యక్ష పీఠంపై మనవాడు... ఎన్నికల్లో భారత సంతతి నేత ఘనవిజయం

Dharman Shanmugaratnam elected as President of Singapore
  • 2011 తర్వాత సింగపూర్ లో దేశాధ్యక్ష ఎన్నికలు
  • 70.4 శాతం ఓట్లతో గెలుపొందిన ధర్మన్ షణ్ముగరత్నం
  • గతంలో ఉప ప్రధానిగా వ్యవహరించిన షణ్ముగరత్నం

ప్రపంచ దేశాల్లో భారత సంతతి వ్యక్తుల హవా కొనసాగుతోంది. సింగపూర్ దేశాధ్యక్షుడిగా భారత సంతతికి చెందిన ధర్మన్ షణ్ముగరత్నం ఎన్నికయ్యారు. 66 ఏళ్ల షణ్ముగరత్నం గతంలో ఆర్థిక శాఖ, విద్యాశాఖ మంత్రిగానూ, డిప్యూటీ ప్రధానమంత్రిగానూ వ్యవహరించారు. 

2011లో తొలిసారిగా సింగపూర్ దేశాధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో  షణ్ముగరత్నం ఇద్దరు చైనా సంతతి నేతలను ఓడించడం విశేషం. ఈ ఎన్నికల్లో షణ్ముగరత్నం 70.4 శాతం ఓట్లు దక్కించుకున్నారు. ఎంగ్ కోక్సోంగ్ 15.7 శాతం, టాన్ కిన్ లియాన్ 13.88 శాతం ఓట్లు పొందారు. 

ఎన్నికల కమిటీ షణ్ముగరత్నం విజయంపై ప్రకటన చేసింది. ప్రస్తుతం సింగపూర్ కు హలీమా యాకూబ్ దేశాధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. ఆమె పదవీకాలం ఈ నెల 13తో ముగియనుంది.

  • Loading...

More Telugu News