Team India: ఆసియా కప్‌లో భారత్‌తో ఢీ.. తుది జట్టును ప్రకటించిన పాకిస్థాన్

Pakistan name unchanged Playing XI for clash against India
  • శనివారం దాయాదుల మధ్య క్రికెట్ పోరు
  • కెప్టెన్‌గా బాబర్ అజామ్, వైస్ కెప్టెన్‌గా షాబాద్ ఖాన్
  • ఆసియా కప్ టోర్నీల్లో 9-6తో భారత్‌దే పైచేయి
ఆసియా కప్‌లో భాగంగా దాయాదుల మధ్య శనివారం మ్యాచ్ జరగనుంది. టీమిండియాతో తలపడనున్న పదకొండు మంది పాక్ ఆటగాళ్లతో కూడిన తుదిజట్టును పాకిస్థాన్ బోర్డు శుక్రవారం రాత్రి ప్రకటించింది.

పాకిస్థాన్ తుది జట్టులో బాబర్ అజామ్ (కెప్టెన్), షాబాద్ ఖాన్ (వైస్ కెప్టెన్), ఫఖర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, సల్మాన్ అలీ అఘా, ఇఫ్తికర్ అహ్మద్, మొహమ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), మొహమ్మద్ నవాజ్, నసీమ్ షా, షహీన్ షా అఫ్రిది, హారిస్ రవూఫ్ ఉన్నారు. ఆసియా కప్ మ్యాచ్‌లలో 9-6తో పాకిస్థాన్‌పై భారత్ పైచేయితో ఉంది. ఈ మ్యాచ్ కోసం కోట్లాది మంది అభిమానులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.
Team India
Pakistan
Cricket

More Telugu News