Varla Ramaiah: చంద్రబాబు, లోకేశ్ లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే కేసులు ఉండవా?: వర్ల రామయ్య

Varla Ramaiah slams YCP leaders after police arrested Ayyanna Patrudu
  • అయ్యన్నపాత్రుడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు
  • భగ్గుమన్న టీడీపీ నేతలు
  • అయ్యన్న అరెస్ట్ పై ఖండన
  • కొడాలి నాని, వంశీ, అంబటి, రోజాలపై ఎన్ని కేసులు పెట్టాలన్న వర్ల రామయ్య
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడిని అరెస్ట్ చేయడంపై టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. అయ్యన్నపాత్రుడిపై కృష్ణాజిల్లా పోలీసులు కేసు నమోదు చేసి విశాఖపట్నం విమానాశ్రయంలో అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య తెలిపారు. 

టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ బాబు తదితర జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకులపై వైసీపీ నేతలు పేర్ని నాని, వల్లభనేని వంశీ, కొడాలి నాని, అంబటి రాంబాబు, ఆర్.కే. రోజా చేసిన, చేస్తున్న అనుచిత వ్యాఖ్యలపై కేసులు ఉండవా? అని పోలీసు అధికారులను వర్ల ప్రశ్నించారు. 

పోలీసు అధికారులు రాజకీయ నాయకులందరిని ఒకేలా చూడాలని, ఒకరిని నెత్తికెత్తుకొని మరొకరిని కింద పడేస్తామంటే అది మంచి పద్ధతి కాదన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులకు, ప్రజలకు, అందరికీ చట్టం ఒకేలా ఉండాలని, చట్టం కొందరికి చుట్టం కాకూడదని, అలా చూసుకోవలసిన బాధ్యత పోలీసు అధికారులపై ఉందని వర్ల గుర్తు చేశారు. 

విచిత్రంగా, అధికారంలోకి వచ్చిన నాటి నుండి, ఈ ప్రభుత్వం రెండు వర్గాల మధ్య వైషమ్యాలు, శత్రుత్వాలు పెంచుతున్నారనే నెపంతో, ఐపీసీ సెక్షన్  153 (A)ను  పదే పదే, ప్రతిపక్షాలపై ఉపయోగించి, ఆ సెక్షన్ ను దుర్వినియోగం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Varla Ramaiah
Ayyanna Patrudu
Chandrababu
Nara Lokesh
TDP
Police
YSRCP
Andhra Pradesh

More Telugu News