Pawan Kalyan: పవన్, సురేందర్ రెడ్డి కాంబోలో కొత్త చిత్రం... ప్రీ ప్రొడక్షన్ పనుల ప్రారంభం

Pawan Kalyan and Surendar Reddy movie office inaugurated today
  • సురేందర్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవన్ కల్యాణ్
  • నేడు హైదరాబాదులో ఆఫీసు ప్రారంభం
  • పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న సురేందర్ రెడ్డి, రామ్ తాళ్లూరి, వక్కంతం వంశీ
  • వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లే అవకాశం
ఏపీలో ఓవైపు ఎన్నికలు సమీపిస్తున్నప్పటికీ, జనసేనాని పవన్ కల్యాణ్ వరుసగా సినిమాలు చేస్తున్నారు. హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్, సుజీత్ దర్శకత్వంలో ఓజీ, క్రిష్ దర్శకత్వంలో హరిహరవీరమల్లు చిత్రాలతో పవన్ తీరికలేకుండా ఉన్నారు. తాజాగా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిత్రానికి పవన్ ఓకే చెప్పారు. దాంతో, ఈ ప్రాజెక్టు ప్రీ ప్రొడక్షన్ పనులకు తెరలేచింది. 

నేడు హైదరాబాదులో ఈ సినిమాకు సంబంధించిన కార్యాలయం ప్రారంభమైంది. ఈ ఆఫీసు పూజా కార్యక్రమాల్లో దర్శకుడు సురేందర్ రెడ్డి, నిర్మాత రామ్ తాళ్లూరి, రచయిత వక్కంతం వంశీ పాల్గొన్నారు. 

తమిళ్ లో హిట్టయిన విక్రమ్ వేద చిత్రానికి ఇది రీమేక్ అని టాక్ వినిపిస్తోంది. అయితే, ఈ సినిమా ఇప్పట్లో సెట్స్ మీదకు వెళ్లకపోవచ్చని తెలుస్తోంది. ఇప్పటికే పవన్ చేతిలో ఉన్న మూడు చిత్రాలు ఓ కొలిక్కి వచ్చేసరికి ఈ ఏడాది పూర్తవుతుంది. దాంతో, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిత్రం 2024లో సెట్స్ మీదికి వెళ్లే అవకాశాలున్నాయి.
Pawan Kalyan
Surendar Reddy
New Movie
Office
Hyderabad

More Telugu News