Chandrababu: చంద్రబాబు పాపాలు ఒక్కటొక్కటి బయటకొస్తున్నాయి: ఏపీ మంత్రి కొట్టు సత్యనారాయణ

Minister Kottu Satyanarayana on IT notices to Chandrababu
  • చంద్రబాబు దగ్గర దొరికింది చాలా తక్కువ అనీ, వేలకోట్లు దోచుకున్నారని ఆరోపణ
  • అవినీతి చేసి వ్యవస్థలను మేనేజ్ చేశాడన్న కొట్టు
  • ఇరుక్కుంటానని తెలిసి ఢిల్లీలో కాళ్లబేరానికి వెళ్లాడని విమర్శ
చంద్రబాబు చేసిన పాపాలు ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్నాయని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. టీడీపీ అధినేతకు ఆదాయపుపన్ను శాఖ నోటీసుల నేపథ్యంలో కొట్టు మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు దగ్గర దొరికింది చాలా తక్కువ అన్నారు. వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు.

పోలవరం ప్రాజెక్టు, స్కిల్ డెవలప్‌మెంట్, ఇసుక.. ఇలా అన్నింటా దోచిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. మేనేజ్ చేయడంలో నిపుణుడు కాబట్టి అవినీతికి పాల్పడిన తర్వాత వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ వచ్చాడన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేసిన దోపిడీకి ఐటీ శాఖ ఇచ్చిన నోటీసు కేవలం శాంపిల్ అన్నారు.

టిడ్కో ఇళ్ల పేరుతో పేదల నుండి ఒక్కొక్కరి దగ్గరి నుండి రూ.3 లక్షలు దోచుకున్నాడన్నారు. డబ్బులు రాని ఆరోగ్యశ్రీ, 108 వంటి వ్యవస్థలను చంద్రబాబు నిర్వీర్యం చేశారన్నారు. తాను ఇరుక్కుపోతానని ముందే తెలియడం వల్లే నాలుగు రోజులుగా ఢిల్లీలో కాళ్లబేరానికి వెల్లాడన్నారు.

Chandrababu
kottu satyanarayana
Minister
YSRCP

More Telugu News