Daggubati Purandeswari: ఒకే దేశం- ఒకే ఎన్నికపై రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీ... పురందేశ్వరి స్పందన

  • ఒకే దేశం-ఒకే ఎన్నికపై కేంద్రం కీలక ముందడుగు
  • కేంద్రం నిర్ణయాన్ని స్వాగతించిన ఏపీ బీజేపీ చీఫ్
  • రాష్ట్ర  ప్రభుత్వాలకు పాలనపై దృష్టి పెట్టే సమయం లభిస్తుందని వెల్లడి
  • ఎన్నికల ఖర్చు తగ్గుతుందని, భద్రతా దళాలపై భారం పడబోదని పురందేశ్వరి వివరణ
Purandeswari opines on Ramnath Kovind committee establishment on One Nation One Election

దేశంలో లోక్ సభ ఎన్నికలతో పాటే అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగితే బాగుంటుందని ప్రధాని నరేంద్ర మోదీ కొంతకాలంగా ఆకాంక్షిస్తున్నారు. ఒకే దేశం-ఒకే ఎన్నిక అంటూ పలు వేదికలపై ఆయన తన మనసులో మాట బయటపెడుతున్నారు. ఈ దిశగా కీలక ముందడుగు పడింది. ఒకే దేశం-ఒకే ఎన్నిక అంశంపై అధ్యయనానికి మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో కేంద్రం కమిటీ ఏర్పాటు చేసింది. 

ఈ నిర్ణయాన్ని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి స్వాగతించారు. దేశంలో ఎక్కడో ఒక చోట, ఏదో ఒక రాష్ట్రంలో తరచుగా ఏదో ఒక స్థాయిలో ఎన్నికలు జరుగుతూనే ఉంటాయని, దాంతో పాలనపై దృష్టి కేంద్రీకరించడం రాష్ట్రాల ప్రభుత్వాలకు కష్టతరమవుతుందని వివరించారు. 

ఈ నేపథ్యంలో, ఒకే దేశం-ఒకే ఎన్నిక విధానం ఎంతో అవసరమని పురందేశ్వరి అభిప్రాయపడ్డారు. ఎన్నికల ఖర్చును తగ్గించడంలోనూ, పరిపాలన, భద్రతా దళాలపై భారం తగ్గించడంలోనూ ఈ విధానం దోహదపడుతుందని తెలిపారు.

More Telugu News