Gudivada Amarnath: చంద్రబాబు పాపం పండింది.. శేషజీవితంలో కర్మఫలం అనుభవించాల్సిందే: ఏపీ మంత్రి అమర్నాథ్

Minister Gudiwada Amarnath on Chandrababu it notices
  • అవినీతికి షర్ట్, ప్యాంట్ వేస్తే చంద్రబాబులా ఉంటుందని ఎద్దేవా
  • అవినీతి కేసు నుండి తప్పించుకునేందుకే ఢిల్లీ పర్యటన అని విమర్శ
  • హెరిటేజ్ వ్యాపారంతో రూ.1 లక్ష కోట్లు సంపాదించారా? అని ప్రశ్న
  • హిందూస్థాన్ టైమ్స్ పత్రికపై చంద్రబాబు స్పందించాలని డిమాండ్
  • ఈ పత్రికపై కూడా లోకేశ్ కేసు వేస్తారా? అనేది చెప్పాలని నిలదీత

ఐటీ శాఖ తనకు జారీ చేసిన నోటీసులపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పందించాలని మంత్రి గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు. శుక్రవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ... అవినీతికి ప్యాంట్, షర్ట్ వేస్తే చంద్రబాబులా ఉంటుందని ఎద్దేవా చేశారు. తన శేష జీవితంలో టీడీపీ అధినేత కర్మఫలం అనుభవించక తప్పదన్నారు. అవినీతి కేసుల నుండి బయటపడేందుకే చంద్రబాబు ఢిల్లీ పర్యటన అన్నారు. ఎన్టీఆర్ రూ.100 నాణెం విడుదల సందర్భంగా ఆయన కూర్చున్న తీరు ఇందుకు నిదర్శనమన్నారు. చంద్రబాబు పాపం పండిందన్నారు. హెరిటేజ్ వ్యాపారంతో రూ.1 లక్ష కోట్లు సంపాదించారా? అని ప్రశ్నించారు.

హిందూస్థాన్ టైమ్స్ కథనంతో చంద్రబాబు అవినీతి బహిర్గతమైందన్నారు. చంద్రబాబు ఏ విధంగా అక్రమమార్గంలో డబ్బులు సంపాదించారనే అంశంపై కథనం ప్రచురించారని తెలిపారు. తనకు అవినీతి అంటేనే తెలియదని చెప్పే చంద్రబాబు ఇప్పుడు తనపై వచ్చిన ఆరోపణల మీద ఎందుకు నోరు మెదపడం లేదని, ఎందుకు ఖండించడం లేదని నిలదీశారు. అవినీతిలో ప్రమేయం ఉంది కాబట్టే చంద్రబాబు నోరు మెదపడం లేదన్నారు. రెండెకరాల నుండి రూ.1 లక్ష కోట్లకు ఎలా ఎదిగారో చంద్రబాబు చెప్పాలన్నారు. చంద్రబాబు పిండింది ఆవు పాలో.. గేదె పాలో కాదని, రాష్ట్ర ఖజానాను అన్నారు.

ఈ మధ్యకాలంలో టీడీపీ అధినేత తన ఆస్తులను ఎందుకు ప్రకటించడం లేదని ప్రశ్నించారు. బాబు అవినీతి గురించి ఆయన పీఏ శ్రీనివాస్ చెప్పారన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర ఖజనాను నిలువునా దోచేశారని ఆరోపించారు. తన తల్లిని ఎవరూ తిట్టకపోయినా కేసులు పెట్టిన లోకేశ్ ఇప్పుడు తన తండ్రిపై వచ్చిన అవినీతి ఆరోపణలు చేస్తూ కథనం రాసిన పత్రికపై కూడా కేసులు వేస్తారా? అని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News