Rashmika Mandanna: ఇప్పుడు నేను చేస్తున్న సినిమాలన్నింటికీ కామన్ పాయింట్ ఒకటే!: రష్మిక

Rashmika Mandanna says there is common point between her new projects
  • అన్ని భాషల చిత్రాల్లో నటిస్తున్న రష్మిక
  • చేతిలో పలు ప్రాజెక్టులతో అమ్మడు బిజీ
  • అప్ డేట్ ఇవ్వొచ్చు కదా అన్న అభిమానులు
  • పిచ్చెక్కిస్తానంతే అంటూ బదులిచ్చిన రష్మిక
  • తాను ఇప్పుడు చేస్తున్నవన్నీ పాన్ ఇండియా చిత్రాలేనని వెల్లడి

కన్నడ భామ రష్మిక మందన్న జాతీయ స్థాయిలో దూసుకుపోతోంది. ఇప్పుడామె డీ-51, యానిమల్, రెయిన్ బో, పుష్ప-2 చిత్రాలతో బిజీగా ఉంది. అందం, నటనా ప్రతిభల కలబోతగా రష్మికను అభివర్ణించవచ్చు. ఛలో చిత్రం నుంచి మొదలుపెడితే పుష్ప వరకు రష్మిక యాక్టింగ్ కు తిరుగులేదు. 

సోషల్ మీడియాలోనూ అమ్మడికి అదిరిపోయే ఫాలోయింగ్ ఉంది. అభిమానులు పంపే సందేశాలతో రష్మిక ఉక్కిరిబిక్కిరి అయిపోతోందట. తాజాగా ఆమెను అభిమానులు ఏదైనా అప్ డేట్ ఉంటే పంచుకోవచ్చు కదా అని అడిగారు. అందుకు రష్మిక "పిచ్చెక్కిస్తానంతే" అంటూ సరదాగా బదులిచ్చింది. 

ఇప్పుడు తాను చేస్తున్న సినిమాలన్నింటికీ ఒక కామన్ పాయింట్ ఉందని తెలిపింది. తాను ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టులన్నీ పాన్ ఇండియా చిత్రాలేనని వెల్లడించింది. పుష్ప-2 చిత్రంలో అల్లు అర్జున్ సరసన, యానిమల్ చిత్రంలో రణబీర్ కపూర్ సరసన... డీ-51లో ధనుష్ తో, రెయిన్ బో చిత్రంలో  ప్రధానపాత్రలో నటిస్తున్నానని, ఇవన్నీ బహుభాషా చిత్రాలేనని రష్మిక వివరించింది.

  • Loading...

More Telugu News