Sri Lanka: ఆసియాకప్: బంగ్లాదేశ్‌ను తేలిగ్గా ఓడించి క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు సాధించిన శ్రీలంక

Sri Lanka record their longest winning streak in ODI cricket history
  • బంగ్లాదేశ్‌పై అలవోక విజయం సాధించిన శ్రీలంక
  • వరుసగా 11 వన్డేల్లో గెలుపుతో రికార్డు
  • తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా

ఆసియాకప్‌లో భాగంగా గత రాత్రి బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించిన శ్రీలంక క్రికెట్ చరిత్రలోనే అత్యంత అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. శ్రీలంకకు ఇది వరుసగా 11వ వన్డే విజయం. ఆ జట్టు వన్డే క్రికెట్ చరిత్రలో వరుసగా ఇన్ని మ్యాచ్‌లు గెలవడం ఇదే తొలిసారి. అంతకుముందు డిసెంబరు 2013-మే 2014 మధ్య వరుసగా 10 వన్డేల్లో, అంతకంటే ముందు ఫిబ్రవరి 2004-జులై 2004 మధ్య పదేసి మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఇప్పుడా రికార్డును అధిగమించింది. ఈ జాబితాలో పదేసి విజయాలతో ఆస్ట్రేలియా (2009-2010), సౌతాఫ్రికా (2013-2014) రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.

ఆసియాకప్‌లో భాగంగా పల్లెకెలె అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 42.4 ఓవర్లలో 164 పరుగులకే కుప్పకూలింది. శ్రీలంక 39 ఓవర్లలో 5 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. సదీరా సమరవిక్రమ (54), చరిత్ అసలంక (62, నాటౌట్) అర్ధ సెంచరీలు చేశారు. నాలుగు వికెట్లు తీసిన మతీశా పథిరనకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

  • Loading...

More Telugu News