సెప్టెంబరు 2 నుంచి తెలంగాణలో ఉపాధ్యాయుల బదిలీలు
- ఇటీవల తెలంగాణ హైకోర్టు తుది తీర్పు
- స్టే ఎత్తివేసిన న్యాయస్థానం
- టీచర్ల బదిలీలకు తొలగిన అడ్డంకులు
- రేపటిలోగా షెడ్యూల్ విడుదల చేయనున్న విద్యాశాఖ
ఈ బదిలీ ప్రక్రియలో... భార్యాభర్తలిద్దరూ ఉపాధ్యాయులైతే వారికి అదనపు పాయింట్లు కేటాయించనున్నారు. టీచర్ల బదిలీలపై జనవరిలోనే షెడ్యూల్ విడుదలైంది. హైకోర్టు స్టే ఇవ్వడంతో ఇన్నాళ్లు జాప్యం జరిగింది. ఇటీవలే న్యాయస్థానం స్టే ఎత్తివేయడంతో బదిలీలకు అవరోధాలు తొలగిపోయాయి.