Pawan Kalyan: ‘ఓజీ’ టీజర్ రిలీజ్‌కు టైం మీరే చెప్పండి.. పవన్​ ఫ్యాన్స్‌ను కోరిన నిర్మాణ సంస్థ

OG Team asks fans to decide the Glimpse release time
  • సెప్టెంబర్ 2న రానున్న టీజర్ గ్లింప్స్
  • సుజీత్ దర్శకత్వంలో నటిస్తున్న పవన్
  • హీరోయిన్‌ గా ప్రియాంక మోహన్
  • కీలక పాత్ర పోషించిన అర్జున్ దాస్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, యువ దర్శకుడు సుజీత్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ‘ఓజీ’. సాహో తర్వాత ఐదేళ్లు విరామం తీసుకున్న సుజీత్‌ ఈ చిత్రంతో తన సత్తా చూపెట్టుకోవాలని పట్టుదలగా ఉన్నాడు. పోస్టర్‌‌ తోనే సినిమాపై అంచనాలు అమాంతం పెంచేశాడు. ఈ చిత్రంలో పవన్ గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించనున్నారు. సెప్టెంబర్ 2న పవన్ బర్త్ డే కానుకగా సినిమా టీజర్ విడుదల కానుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్ టైన్మెంట్ స్పష్టం చేసింది.

అంతేకాదు ఆ రోజు ఏ సమయంలో టీజర్ ను విడుదల చేయాలో చెప్పాలంటూ అభిమానులను అడిగింది. ‘ఆ రోజంతా పండగే కాబట్టి మేరే చెప్పండి సెప్టెంబర్ 2న ఏ టైమ్‌కి విడుదల చేద్దామో? ఫ్యాన్స్ అందరి స్పందన చూసి ఈ రోజు సాయంత్రానికి ఫైనల్ గా ఒక టైం ఫిక్స్ అవుదాం’ అని ట్వీట్ చేసింది. ఈ సినిమాలో తమిళ నటుడు అర్జున్‌ దాస్‌ కీలకపాత్ర పోషిస్తున్నాడు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్‌ సరసన ప్రియాంక మోహన్‌ నటిస్తోంది.

  • Loading...

More Telugu News