Srisailam: శ్రీశైలంలో భారీ అగ్నిప్రమాదం..పలు షాపులు మంటలకు ఆహుతి

Fire Accident in Srisailam 15 shops turned to ashes
  • ఎల్ బ్లాక్ సముదాయంలోని లలితాంబికా దుకాణంలో బధవారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం
  • ఇతర షాపులకు మంటలు వ్యాప్తి, కాలి బూడిదైన 15 దుకాణాలు
  • సమాచారం అందగానే రంగంలోకి దిగి మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది
  • రూ.2 కోట్ల మేరకు ఆస్తి నష్టం ఉంటుందని అధికారుల అంచనా
  • షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగుండొచ్చన్న అనుమానాలు వ్యక్తం
శ్రీశైలంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఎల్ బ్లాక్ సముదాయంలో ఉన్న లలితాంబికా దుకాణంలో బుధవారం ఆర్ధరాత్రి దాటాక మంటలు చెలరేగాయి. మంటలు పెద్దఎత్తున వ్యాపించడంతో సుమారు 15 దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపు చేశారు. ఇతర సహాయక చర్యలు చేపట్టారు. 

శ్రీశైలం దేవస్థానం ఈవో ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ ఘటనలో సుమారు రూ.2 కోట్ల వరకూ ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చని అధికారుల అంచనా. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Srisailam
Fire Accident
Andhra Pradesh
Telangana

More Telugu News