తెలంగాణలో టీచర్ల బదిలీలకు లైన్ క్లియర్
- టీచర్ల బదిలీకి అనుమతించిన తెలంగాణ హైకోర్టు
- ఉపాధ్యాయ దంపతులకు అదనపు పాయింట్లు కేటాయించడాన్ని సమర్థించిన న్యాయస్థానం
- ఈ మేరకు గతంలో మధ్యంతర ఉత్తర్వులను సవరిస్తూ తీర్పు
- తుది తీర్పునకు లోబడి బదిలీలు చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశం
టీచర్ యూనియన్ నేతలకు 10 అదనపు పాయింట్లను తప్పు పట్టిన కోర్టు.. ఈ పాయింట్లు లేకుండానే బదిలీలను చేపట్టాలని కోరింది. అయితే, ఉపాధ్యాయ దంపతులకు అదనపు పాయింట్లు కేటాయింపును అనుమతించింది. భార్యాభర్తలు కలిసి ఉండాలన్నదే ఈ నిబంధన ఉద్దేశమని పేర్కొంది. దీంతో, ఉపాధ్యాయ దంపతుల కష్టాలకు చెక్ పడినట్టయింది.