Skanda: రికార్డులు బ్రేక్ చేస్తున్న రామ్ ‘స్కంద’ బిజినెస్​

Skanda Movie Non Theatrical Rights Sold For A Whopping Price
  • రూ. 45 కోట్లకు స్టార్ సంస్థ కొనుగోలు!
  • సెప్టెంబర్ 15న విడుదల కానున్న చిత్రం
  • రామ్ కెరీర్ లో ఇదే తొలి ప్యాన్ ఇండియా సినిమా
బోయపాటి శ్రీను, రామ్ పోతినేని కాంబినేషన్ లో వస్తున్న తొలి చిత్రం ‘స్కంద’. వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 15న విడుదల కానుంది. రామ్ కెరీర్‌‌ లో ఇదే తొలి ప్యాన్ ఇండియా చిత్రం. ఇది ఏకంగా ఐదు భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్‌, ట్రైలర్‌ సినిమాపై అంచనాలు పెంచాయి. ఈ చిత్రంలో అందాల నటి శ్రీలీల హీరోయిన్‌ గా నటిస్తోంది. ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్ కోసం చిత్ర బృందం సన్నద్ధం అవుతోంది.

ఇదిలా ఉండగా, సినిమా బిజినెస్ గురించి తాజాగా ఓ అప్‌డేట్ వచ్చింది. చిత్రం నాన్‌-థియేట్రికల్‌ హక్కులకు భారీ డీల్ కుదిరిందని తెలుస్తోంది. అన్ని భాషల డిజిటల్‌, శాటిలైట్ హక్కులను స్టార్‌ సంస్థ రూ.45 కోట్లకు కొనుగోలు చేసిందని, రామ్ కెరీర్ లో ఇదే అత్యధిక డీల్ అని తెలుస్తోంది. పూర్తి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు థమన్‌ సంగీతం అందించారు.
Skanda
Movie
ram potineni
Boyapati Sreenu
sreeleela

More Telugu News