R Praggnanandhaa: కృతజ్ఞతలు చెప్పేందుకు మాటలు రావడం లేదంటూ ఆనంద్ మహీంద్రాకు చెస్ చిచ్చర పిడుగు ప్రజ్ఞానంద ట్వీట్

R Praggnanandhaa Reacts As Anand Mahindra Fulfils His Parents Long Term Dream
  • చెస్ ప్రపంచ కప్‌ లో రజతం నెగ్గి ప్రజ్ఞానంద
  • మహీంద్రా ఈవీ కారును బహుమతిగా ప్రకటించిన ఆనంద్
  • ఈవీ కారు కొనాలన్నది తన తల్లిదండ్రుల కల అన్న ప్రజ్ఞానంద

భారత చెస్ చిచ్చరపిడుగు, ఫిడే చెస్ ప్రపంచ కప్‌ లో రన్నరప్ గా నిలిచి ఔరా అనిపించిన ఆర్. ప్రజ్ఞానంద తల్లిదండ్రులకు వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు బహుమతిగా ఇస్తున్నట్లు ప్రకటించారు. చదరంగంలో అద్భుతంగా రాణిస్తున్న ప్రజ్ఞాను ప్రోత్సహించేందుకు ఓ కారు బహుమతిగా ఇవ్వమని ఆనంద్ మహీంద్రాను పలువురు సోషల్ మీడియాలో  కోరారు. మహీంద్రా థార్ కారును ఇవ్వమని సూచించగా.. అంతకంటే ఖరీదైన ఎక్స్యూవీ 400 ఈవీని నజరానాగా ఇస్తున్నట్టు ఆనంద్ ట్వీట్ చేశారు.  

‘చాలా మంది ప్రజ్ఞానందకు థార్ బహుమతిగా ఇవ్వమని రిక్వెస్ట్ చేశారు. కానీ నాకు మరో ఆలోచన ఉంది. తల్లిదండ్రులు తమ పిల్లలకు చెస్‌ను పరిచయం చేయమని, వారికి మద్దతు ఇస్తూ సపోర్ట్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి మేము ప్రజ్ఞానానంద తల్లిదండ్రులకు ఎక్స్ యూవీ 4OO ఈవీని బహుమతిగా ఇవ్వాలని భావిస్తున్నా’ అని ఆయన ప్రకటించారు. దీనిపై ప్రజ్ఞానంద స్పందించాడు. ఎలక్ట్రిక్ కారును కొనాలని తన తల్లిదండ్రులు చాన్నాళ్ల నుంచి అనుకుంటున్నారని చెప్పారు. వారి కలను నిజం చేసినందుకు ఆనంద్ మహీంద్రాకు కృతజ్ఞతలు చెప్పేందుకు మాటలు రావడం లేదని ట్వీట్ చేశాడు. దీనికి సమాధానంగా ‘కార్ల తయారీదారు అంతిమ లక్ష్యం కలలను నిజం చేయడమే‘ అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News