Tale Bhadraiah: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే

TDP Ex MLA Tale Bhadraiah joins YSRCP in presence of Jagan
  • వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే తలే భద్రయ్య
  • టీడీపీ నుంచి రెండు సార్లు గెలిచిన భద్రయ్య
  • పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన జగన్

ఏపీలో టీడీపీకి షాక్ తగిలింది. తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే తలే భద్రయ్య వైసీపీలో చేరారు. ఆయన తనయుడు డాక్టర్ తలే రాజేశ్ కూడా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వారు వైసీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో వైవీ సుబ్బారెడ్డి, గుడివాడ అమర్ నాథ్ తదితరులు కూడా పాల్గొన్నారు. భద్రయ్య, రాజేశ్ లకు పార్టీ కండువా కప్పి వైసీపీలోకి జగన్ సాదరంగా ఆహ్వానించారు. పాలకొండ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున 1985, 1994 ఎన్నికల్లో భద్రయ్య గెలుపొందారు. ఏపీపీఎస్సీ సభ్యుడిగా కూడా ఆయన ఆరేళ్ల పాటు పని చేశారు.

  • Loading...

More Telugu News