హ్యాపీ జర్నీ కోసం విమానంలో ‘అడల్ట్స్ ఓన్లీ’ సెక్షన్
- అందుబాటులోకి తీసుకొస్తున్న కొరెండాన్ ఎయిర్‌లైన్స్
- ఒంటరి ప్రయాణికుల కోసం ‘పెద్దలకు మాత్రమే’ క్యాబిన్
- 16 ఏళ్లు దాటిన వారికి మాత్రమే అనుమతి
- అదనపు రుసుము చెల్లించుకోవాల్సిందే
16 ఏళ్లు దాటిన వారిని మాత్రమే ఇందులోకి అనుమతిస్తారు. ఈ విభాగంలో సీటుకోసం అదనపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. పిల్లలు లేకుండా ఒంటరిగా ప్రయాణించే వారు ఇతర ప్రయాణికుల నుంచి ఇబ్బంది పడకుండా హాయిగా, ప్రశాంతంగా ప్రయాణించేందుకు వీలుగా ఈ విభాగాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు కొరెండాన్ ఎయిర్‌లైన్స్ తెలిపింది.
ఈ విభాగంలో నో కిడ్స్ జోన్‌లో సీటు కోసం అదనంగా 45 యూరోలు(49 డాలర్లు) చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. ఎక్స్‌ట్రా లాంగ్‌రూం సీట్స్ కోసం 100 యూరోలు (109 డాలర్లు) అదనంగా చెల్లించాల్సి ఉంటుందని వివరించింది. కాగా, ఆమ్‌స్టర్‌డామ్-కురసావో మధ్య విమాన ప్రయాణం దాదాపు 10 గంటలు ఉంటుంది.