Keerthi Suresh: 'ఓనమ్' చీరకట్టులో కీర్తి సురేశ్.. లేటెస్ట్ పిక్స్!

Keerthi Suresh Special
  • 3 భాషల్లో స్టార్ హీరోయిన్ గా కీర్తి సురేశ్ 
  • ఓనమ్ శారీలో మెరిసిన అందాల చందమామ
  • మనసులు కట్టిపడేసే నవ్వు ఆమె సొంతం
  • సోషల్ మీడియాలో సందడి చేస్తున్న లేటెస్ట్ స్టిల్స్  

టాలీవుడ్ లో టాప్ త్రీ హీరోయిన్స్ లో కీర్తి సురేశ్ ఒకరు. తెలుగులో మాత్రమే కాదు, తమిళ .. మలయాళ భాషల్లోను ఆమె స్టార్ హీరోయిన్. కీర్తి సురేశ్ అంటే గ్లామర్ మాత్రమే కాదు .. వంక బెట్టలేని నటన కూడా. పాత్ర నచ్చితే చాలు డీగ్లామర్ రోల్స్ చేయడానికి కూడా ఆమె వెనుకాడదు. ఆల్రెడీ ఆ తరహా పాత్రలను చేసింది కూడా.సీనియర్ స్టార్ హీరోలకు చెల్లెలిగా నటిస్తే, హీరోయిన్ గా తమ గ్రాఫ్ పడిపోతుందని చాలామంది హీరోయిన్స్ భావిస్తుంటారు. అలాంటి విషయాన్ని గురించి ఎంతమాత్రం ఆలోచించకుండా అటు రజనీకి .. ఇటు చిరంజీవికి చెల్లెలి పాత్రలను చేసి మెప్పించిన ఘనత కీర్తి సురేశ్ కి దక్కింది. ప్రస్తుతం ఆమె చేతిలో నాలుగు తమిళ సినిమాలు ఉన్నాయి. ఇక రీసెంటుగా ఒకటి రెండు తెలుగు ప్రాజెక్టులలో కూడా ఆమె పేరు వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె లేటెస్ట్ స్టిల్స్  యూత్ ను హుషారెత్తించేలా ఉన్నాయి. ఓనమ్ ఫెస్టివల్ సందర్భంగా ఆమె ఇలా అందమైన చీరకట్టులో మెరిసింది. కీర్తినిలా చూస్తుంటే కుర్రాళ్లలో చాలామంది కవులో .. గాయకులో .. చిత్రకారులో కావడం ఖాయమేనని అనిపిస్తోంది కదూ. 
Keerthi Suresh
Actress
Tollywood

More Telugu News