Imran Khan: ఇమ్రాన్ ఖాన్ కు భారీ ఊరట.. మూడేళ్ల జైలు శిక్ష నిలిపివేత!

  • తోషాఖానా కేసులో ఇమ్రాన్ ఖాన్ కు మూడేళ్ల జైలు శిక్ష
  • పంజాబ్ ప్రావిన్స్ లోని అటోక్ జిల్లా జైల్లో శిక్షను అనుభవిస్తున్న ఇమ్రాన్
  • జైలు నుంచి విడుదల కానున్న ఇమ్రాన్  
Islamabad High Court stops jail verdict of Imran Khan

పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కు అతిపెద్ద ఊరట లభించింది. తోషాఖానా కేసులో ట్రయల్ కోర్టు విధించిన మూడేళ్ల జైలు శిక్షను ఇస్లామాబాద్ హైకోర్టు నిలిపివేసింది. తనకు పడ్డ శిక్షను రద్దు చేయాలంటూ ఇమ్రాన్ ఖాన్ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన హైకోర్టు ఈరోజు తీర్పును వెలువరించింది. ఇమ్రాన్ కు బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు ఇమ్రాన్ ప్రస్తుతం పంజాబ్ ప్రావిన్స్ లోని అటోక్ జిల్లా జైల్లో శిక్షను అనుభవిస్తున్నారు. కోర్టు ఆదేశాల నేపథ్యంలో జైల్లో ఆయనకు ప్రత్యేక సదుపాయాలను కల్పించారు. తాజాగా హైకోర్టు తీర్పుతో ఇమ్రాన్ ఖాన్ జైలు నుంచి విడుదల కానున్నారు.

More Telugu News