Massage centers: స్పా ముసుగులో వ్యభిచారం.. బంజారాహిల్స్ లో స్పాలపై పోలీసుల దాడులు

Massage centers Seized in Banjarahills
  • వ్యభిచారం నిర్వహిస్తున్న రెండు సెంటర్ల సీజ్
  • నిర్వాహకులు, విటులను అరెస్టు చేసిన పోలీసులు
  • మొత్తం 17 మంది యువతులు రెస్క్యూ  హోంకు తరలింపు
హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో స్పాలు, మసాజ్ సెంటర్లలో పోలీసులు మంగళవారం దాడులు చేశారు. మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న రెండు సెంటర్లను సీజ్ చేసి, నిర్వాహకులతో పాటు పలువురు విటులను అరెస్ట్ చేశారు. రెండు సెంటర్లలో మొత్తం 17 మంది యువతులను రెస్క్యూ హోంకు తరలించారు. అమాయక యువతులే టార్గెట్ గా డబ్బు ఆశ చూపి ఈ దందా నిర్వహిస్తున్నారని పోలీసులు తెలిపారు. మసాజ్ థెరపిస్టులు, బ్యూటీషియన్లు పేరుతో వివిధ ప్రాంతాల నుంచి యువతులను రప్పిస్తున్నారని చెప్పారు. ఆపై వారికి పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తామని చెప్పి వ్యభిచారం చేయిస్తున్నారని వివరించారు. దీనిపై పక్కా సమాచారంతో మంగళవారం దాడులు నిర్వహించగా.. రెండు సెంటర్లలో వ్యభిచారం జరుగుతున్నట్లు గుర్తించామన్నారు. 

బంజారాహిల్స్ రోడ్ నెం.2 లో ఫ్యామిలీ సెలూన్ ముసుగులో వ్యభిచారం జరుగుతోందని గుర్తించినట్లు బంజారాహిల్స్ ఎస్సై ఎస్.కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఈ సెలూన్ కు ఎలాంటి అనుమతులు లేవని తేలిందన్నారు. సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయలేదని, పదిమంది యువతులతో వ్యభిచారం చేయిస్తున్నట్లు గుర్తించామని చెప్పారు. దీంతో సెలూన్ నిర్వాహకుడిపై ఐపీసీ సెక్షన్ 188 కింద కేసు నమోదు చేసి, దర్యాఫ్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Massage centers
Banjarahills
spa seized
Hyderabad
prostitution
police raids

More Telugu News