Tollywood: మీడియా ముందే టాలీవుడ్ హీరోయిన్ కు ముద్దు పెట్టిన డైరెక్టర్

Filmmaker AS Ravi Kumar Kisses Mannara Chopra In Press Meet Netizens Call It Totally Absurd
  • రాజ్ తరుణ్ సరసన తిరగబడరా సామి చిత్రంలో నటిస్తున్న మన్నారా
  • సినిమాకు దర్శకత్వం వహించిన ఏఎస్ రవికుమార్
  • టీజర్ రిలీజ్ ఈవెంట్ లో మన్నారా చెంపపై ముద్దు పెట్టిన రవి కుమార్

బాలీవుడ్ -హాలీవుడ్ నటి ప్రియాంక చోప్రాకు కజిన్ అయిన మన్నారా చోప్రా టాలీవుడ్ లో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తోంది. చిన్న చిన్న సినిమాలతో నటిగా తనను తాను నిరూపించుకునే ప్రయత్నంలో ఉంది. ప్రస్తుతం ఆమె ఏఎస్ రవికుమార్‌ చౌదరి దర్శకత్వంలో రాజ్‌ తరుణ్‌ హీరోగా ‘తిరగడబారా సామి’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ మధ్యే ఈ సినిమా టీజర్‌ ను విడుదల చేశారు. ఈ ఈవెంట్‌లో దర్శకుడు ఏఎస్‌ రవి కుమార్‌ హీరోయిన్ మన్నారా చోప్రాతో వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. 

సినిమా పోస్టర్ ముందు మన్నారా భుజంపై చేయివేసి, ఫొటోలకు పోజులిచ్చిన రవి కుమార్ ఆమె చెంపపై ముద్దు పెట్టాడు. ఆ సమయంలో ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక మన్నారా చోప్రా నవ్వుతూ ఊరుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హీరోయిన్లతో పబ్లిక్ గా ఇలా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనికి ఏఎస్‌ రవికుమార్‌, మన్నారా ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

  • Loading...

More Telugu News