Jagan: కోడికత్తితో దాడి కేసు.. జగన్ కోర్టుకు రావాలని డిమాండ్ చేస్తూ దళిత సంఘాల నిరసన!

Dalit unions protest in Vizag demanding CM Jagan to attend Kodi Kathi case trail in court
  • జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కోడికత్తితో దాడి
  • కేసు విచారణ విజయవాడ నుంచి విశాఖ ఎన్ఐఏ కోర్టుకు బదిలీ
  • ఉదయం 10 గంటలకు ప్రారంభమైన కోర్టు విచారణ
విశాఖపట్నం ఎయిర్ పోర్టులో అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న సీఎం జగన్ పై కోడికత్తితో దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణను విజయవాడ నుంచి విశాఖ ఎన్ఐఏ కోర్టుకు బదిలీ చేశారు. నేటి నుంచి విశాఖలో విచారణ జరగనుంది. మరోవైపు, జగన్ పై దాడికి పాల్పడిన శ్రీనివాస్ ను కోర్టు విచారణకు పోలీసులు క్రమం తప్పకుండా తీసుకొస్తున్నారు. అయితే, జగన్ మాత్రం కోర్టు విచారణకు హాజరు కావడం లేదు. ఈ నేపథ్యంలో, జగన్ కోర్టుకు రావాలంటూ దళిత సంఘాల ఐక్య వేదిక విశాఖలో నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది.  జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఈ ఉదయం 11 గంటల నుంచి నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఇంకోవైపు, ఉదయం 10 గంటలకు ఎన్ఐఏ కోర్టులో కోడికత్తి కేసు విచారణ ప్రారంభమయింది.
Jagan
YSRCP
Kodi Kathi Case
Dalit Unions
Vizag

More Telugu News