Nandamuri Hari Krishna: నిండైన ఆత్మీయతకు, ఆత్మాభిమానానికి ప్రతిరూపం హరికృష్ణ: చంద్రబాబు

Chandrababu pays tributes to Nandamuri Hari Krishna
  • 2018 ఆగస్ట్ 29న రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ దుర్మరణం
  • హరికృష్ణకు నివాళి అర్పించిన చంద్రబాబు
  • ప్రజలకు, పార్టీకి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం అన్న బాబు

రాజ్యసభ మాజీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే నందమూరి హరికృష్ణ వర్ధంతి నేడు. ఈ సందర్భంగా ఆయనను పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు స్మరించుకుంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆయనకు నివాళి అర్పించారు. ట్విట్టర్ ద్వారా ఆయన స్పందిస్తూ... నిండైన ఆత్మీయతకు, ఆత్మాభిమానానికి ప్రతిరూపం నందమూరి హరికృష్ణ అని కొనియాడారు. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యునిగా, శాసనసభ్యునిగా, రాజ్యసభ సభ్యునిగా ప్రజలకు, పార్టీకి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం అని చెప్పారు. ఆత్మీయుడు హరికృష్ణ వర్ధంతి సందర్భంగా ఆయన స్మృతికి నివాళులు అర్పిస్తున్నానని ట్వీట్ చేశారు. 

2018 ఆగస్ట్ 29న 61 ఏళ్ల హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. హైదరాబాద్ నుంచి నెల్లూరుకు కారులో వెళ్తుండగా నార్కట్ పల్లి వద్ద టయోటా ఫార్చ్యూనర్ కారు రోడ్డు ప్రమాదానికి గురయింది. ఆ సమయంలో కారును హరికృష్ణ స్వయంగా డ్రైవ్ చేస్తున్నారు. కారు అత్యంత వేగంగా వెళ్తున్న సమయంలో వాటర్ బాటిల్ తీసుకోవడానికి ఆయన వెనక్కి తిరిగారు. ఈ క్రమంలో అదుపుతప్పిన కారు యాక్సిడెంట్ కు గురయింది. ఈ ప్రమాదంలో ఆయన కన్నుమూశారు. 

  • Loading...

More Telugu News