KA Paul: వైజాగ్ రోడ్డుపై ఒకరినొకరు పలకరించుకున్న కేఏ పాల్, నవీన్ పోలిశెట్టి... ఆసక్తికర వీడియో ఇదిగో!

KA Paul and Naveen Polisetti wishes each other on Vizag beach road
  • వైజాగ్ బీచ్ రోడ్డులో ఆసక్తికర దృశ్యం
  • సిగ్నల్ వద్ద నిలిచిన కేఏ పాల్ వాహనం
  • సీఎం సీఎం అంటూ మద్దతుదారుల నినాదాలు
  • అంతలో అటుగా వచ్చిన నవీన్ పోలిశెట్టి
  • నవీన్ వైపు పరుగులు తీసిన జనాలు
వైజాగ్ లో ఆసక్తికర సన్నివేశం ఆవిష్కృతమైంది. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వాహనం బీచ్ రోడ్డులో సిగ్నల్స్ వద్ద ఆగింది. దాంతో ఆయన మద్దతుదారులు పెద్దఎత్తున గుమికూడి సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. కారు లోంచి లేచి నిలబడిన కేఏ పాల్ వారందరికీ అభివాదం చేశారు. 

అదే సమయంలో అటుగా సినీ హీరో నవీన్ పోలిశెట్టి వచ్చారు. 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమా ప్రమోషన్స్ కోసం ఆయన వైజాగ్ లో అడుగుపెట్టారు. బీచ్ రోడ్ సిగ్నల్ వద్ద నవీన్ కారు కూడా ఆగింది. అప్పటికే అక్కడ కేఏ పాల్ సందడి చేస్తున్నారు. 

ఇంతలో నవీన్ పోలిశెట్టి రావడంతో, జనాలు అటువైపు పరుగులు తీశారు. ఇంతలో నవీన్ కారులోంచి లేచి నిలబడి కేఏ పాల్ కు చేయి ఊపారు. ప్రతిగా కేఏ పాల్ కూడా చేయి ఊపి పలకరించారు. అనంతరం నవీన్ పోలిశెట్టి అక్కడ్నించి నిష్క్రమించారు.
KA Paul
Naveen Polisetti
Vizag
Prajasanthi Party
Miss Shetty Mr Polisetti

More Telugu News