nita ambani: రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డు డైరెక్టర్‌ పదవికి నీతా అంబానీ రాజీనామా

Nita Ambani resigns from Reliance Board
  • రాజీనామాను ఆమోదించిన డైరెక్టర్లు
  • బోర్డులోకి ఇషా, ఆకాశ్, అనంత్ అంబానీల ఎంట్రీ
  • నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా నియామకం!
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ భార్య నీతా అంబానీ కంపెనీ బోర్డు నుండి తప్పుకున్నారు. ఇప్పటి వరకు ఆమె బోర్డులో డైరెక్టర్‌గా ఉన్నారు. అయితే వారి పిల్లలు ఇషా, ఆకాశ్, అనంత్ అంబానీలు బోర్డులోకి వస్తుండటంతో ఆమె తప్పుకున్నారు. సంస్థ‌లో ఈ ముగ్గుర్నీ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్లుగా నియ‌మించ‌నున్నారు. 46వ వార్ష‌ిక సాధారణ స‌మావేశంలో ముఖేశ్ అంబానీ మాట్లాడుతూ... ఈ విషయాన్ని వెల్లడించారు. 

ఇక, కొన్నేళ్లుగా వీరు ముగ్గురు వ్యాపారాలను చూసుకుంటున్నారు. రిటైల్, డిజిట‌ల్ స‌ర్వీసులు, ఎన‌ర్జీ రంగాల‌కు చెందిన వ్యాపారాన్ని చూసుకుంటున్నారు. రిల‌య‌న్స్ అనుబంధ‌ కంపెనీల బోర్డుల్లోనూ వీరు ఉన్నారు. ఇప్పుడు వీరు బోర్డులోకి వస్తున్న నేపథ్యంలో నీతా రాజీనామాను డైరెక్ట‌ర్లు అంగీక‌రించారు. అయితే అన్ని బోర్డు మీటింగ్‌ల‌కు ఆమె ఓ ప‌ర్మ‌ినెంట్ ఇన్వైటీగా హాజరవుతారు.
nita ambani
Mukesh Ambani
Reliance

More Telugu News