madan reddy: నా టిక్కెట్‌ను కేసీఆర్ ఎందుకు ఆపారో అర్థం కావడం లేదు: నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి

  • టిక్కెట్ తనకే వస్తుందని ఎమ్మెల్యే ధీమా
  • తనకు కేసీఆర్ న్యాయం చేస్తారని వ్యాఖ్య
  • పార్టీ మారే సమస్యే ఉత్పన్నం కాదన్న ఎమ్మెల్యే
Madan Reddy on Narsapur MLA ticket

నర్సాపూర్ ఎమ్మెల్యే టిక్కెట్ తనకే వస్తుందని బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. ఇటీవల పార్టీ అధినేత కేసీఆర్ 115 స్థానాలకు గాను అభ్యర్థులను ప్రకటించారు. అయితే నర్సాపూర్ సహా నాలుగు నియోజకవర్గాలను పెండింగ్‌లో ఉంచారు. సిట్టింగ్ అయిన తనకు టిక్కెట్‌ను పెండింగ్‌లో పెట్టడంపై ఎమ్మెల్యే మాట్లాడుతూ... తనకు టిక్కెట్‌ను ఎందుకు ఆపారో అర్థం కావడం లేదన్నారు. సునీతా లక్ష్మారెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చినా తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. టిక్కెట్ విషయంలో తనకు, సునీతకు మధ్య టగ్ ఆఫ్ వార్ ఏమీ లేదని, తనకు టిక్కెట్ ఇస్తే వార్ వన్ సైడ్ ఉంటుందన్నారు.

టిక్కెట్ రాకుంటే పార్టీ మారుతారా? అని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. అసలు ఆ సమస్యే ఉత్పన్నం కాదన్నారు. తాను ఎటూ వెళ్లేది లేదనీ... అలాగే కేసీఆర్ తనకే టిక్కెట్ ఇస్తారనే నమ్మకం ఉందన్నారు. తనకు కేసీఆర్ న్యాయం చేస్తాడని చెప్పారు. తనకు రాజకీయ భిక్ష పెట్టిందే కేసీఆర్ అని, పార్టీ మారేది లేదన్నారు. తనను నియోజకవర్గ ప్రజలు రెండుసార్లు గెలిపించారన్నారు.

More Telugu News