rekha naik: పదవీ కాలం ముగిసే వరకు మాత్రమే బీఆర్ఎస్‌లో ఉంటాను: ఎమ్మెల్యే రేఖానాయక్

MLA Rekha Naik says she will join Congress
  • కాంగ్రెస్ పార్టీ నుండే వచ్చాను... మళ్లీ అదే పార్టీలోకి వెళ్తానన్న ఎమ్మెల్యే
  • బీఆర్ఎస్ తనను పక్కన పెట్టిందని ఆవేదన
  • ఇటీవల బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో లేని రేఖానాయక్ పేరు

తాను కచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తానని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ స్పష్టం చేశారు. సోమవారం ఆమె మాట్లాడుతూ.. తాను కాంగ్రెస్ పార్టీ నుండే బీఆర్ఎస్‌లోకి వచ్చానని, మళ్లీ అదే కాంగ్రెస్‌లోకి వెళ్తానని వెల్లడించారు. అయితే ఎమ్మెల్యే పదవీ కాలం ముగిసే వరకు తాను బీఆర్ఎస్‌లో ఉంటానని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ తనను పక్కన పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఇటీవల కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో ఖానాపూర్ ఎమ్మెల్యేగా ఉన్న రేఖానాయక్ పేరు లేదు. ఆమె స్థానంలో మరొకరికి టిక్కెట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆమె కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఇప్పటికే ఆమె భర్త కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమె కూడా ఎప్పుడైనా చేరే అవకాశాలు ఉన్నట్లుగా భావిస్తున్నారు. అయితే ఎమ్మెల్యే పదవీ కాలం ముగిసిన తర్వాత చేరుతానని ఆమె చెప్పడం గమనార్హం.

  • Loading...

More Telugu News