Vivo V29e: 50 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాతో వివో వీ29ఈ

Vivo V29e with 50MP selfie camera launched in India price starts at Rs 26999
  • మొత్తం రెండు వేరియంట్లలో లభ్యం
  • ధరలు రూ.26,999 నుంచి రూ.28,999 వరకు
  • సెల్ఫీ ఫొటోలు మెరుగ్గా వచ్చేలా ఐ ఆటో ఫోకస్
వివో సంస్థ మధ్యశ్రేణి ధరలో నూతన 5జీ స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ముఖ్యంగా కెమేరాకు ప్రాధాన్యం ఇచ్చే కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని ఈ ఫోన్ ను రూపొందించినట్టు ఫీచర్లు చూస్తే తెలుస్తుంది. ఈ ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర రూ.26,999. 8జీబీ ర్యామ్ 256 జీబీ స్టోరేజ్ ధర రూ.28,999. 

ఆర్టిస్టిక్ రెడ్, ఆర్టిస్టిక్ బ్లూ రంగుల్లో ఒకదాన్ని ఎంపిక చేసుకోవచ్చు. ఫ్లిప్ కార్ట్ తో పాటు, వివో పోర్టల్, ఆఫ్ లైన్ స్టోర్లలోనూ ఇది అందుబాటులో ఉంటుంది. ఇది స్లీక్ డిజైన్ తో వస్తుంది. కేవలం 7.57 శాతం ఎంఎం మందంతో ఉంటుంది. 6.73 అంగుళాల అమోలెడ్డిస్ ఫుల్ హెచ్ డీ ప్లే తో వస్తుంది. సెల్ఫీల కోసం 50 మెగాపిక్సల్ కెమెరా ఉంటుంది. ఐ ఆటో ఫోకస్ ఫీచర్ తో ఉండడం వల్ల సెల్ఫీలు మరింత మెరుగ్గా వస్తాయని వివో ప్రకటించింది.

ఇక ఫోన్ వెనుక భాగంలో 64 మెగాపిక్సల్ ప్రధాన కెమెరాతో డ్యుయల్ కెమెరా సిస్టమ్ ఉంటుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో ఉంటుంది. రెండో కెమెరా 8 మెగాపిక్సల్ తో వైడ్ యాంగిల్ లెన్స్ కలిగి ఉంటుంది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 695 ప్రాసెసర్ ఇందులో ఉంటుంది. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని 44వాట్ అడాప్టర్ తో చార్జ్ చేసుకోవచ్చు. ఫోన్ బాక్స్ తోపాటు ఈ అడాప్టర్ కూడా వస్తుంది.
Vivo V29e
50MP selfie camera
launched
5G phone

More Telugu News