Chandrayaan-3: చందమామపై ఎంత వేడి ఉంటుందో కొలిచిన ప్రజ్ఞాన్ రోవర్

Chandrayaan 3 measures temperature in moon surface
  • దక్షిణ ధృవంలో ఉపరితల ఉష్ణోగ్రత 50 డిగ్రీలుగా పేర్కొన్న ప్రజ్ఞాన్
  • 8 సెంమీ లోతున మైనస్ 10 డిగ్రీల ఉష్ణోగ్రత ఉందని వెల్లడి
  • ఓ గ్రాఫ్ రూపంలో సమాచారం పంపిన ప్రజ్ఞాన్ రోవర్
  • చంద్రుడి దక్షిణ ధృవ ఉష్ణోగ్రతలకు సంబంధించి ఇదే తొలి సమాచారమన్న ఇస్రో 
భారత్ ప్రయోగించిన చంద్రయాన్-3 విజయవంతంగా జాబిల్లిపై దిగిన సంగతి తెలిసిందే. ఈ మిషన్ లో అత్యంత కీలకమైన పరికరం ప్రజ్ఞాన్ రోవర్. విక్రమ్ ల్యాండర్ నుంచి చంద్రుడి ఉపరితలంపైకి దిగిన ప్రజ్ఞాన్ రోవర్ అప్పుడే పని ప్రారంభించింది. 

చంద్రుడి వాతావరణంలో ఉండే వేడిని కొలిచింది. చంద్రుడి ఉపరితలంపై ఉష్ణోగ్రత 50 డిగ్రీలు ఉన్నట్టు గుర్తించింది. అంతేకాదు, చంద్రుడి ఉపరితలంపై పది సెంటీమీటర్ల లోతులోనూ ఉష్ణోగ్రత ఎంత ఉందో తెలుసుకునే సామర్థ్యం ప్రజ్ఞాన్ రోవర్ కు ఉంది. ఇది 8 సెంటీమీటర్ల లోతులో మైనస్ 10 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నట్టు గుర్తించింది. 

ఈ మేరకు సేకరించిన డేటాను విక్రమ్ ల్యాండర్ ద్వారా భూమికి చేరవేసింది. ఓ గ్రాఫ్ రూపంలో ఈ సమాచారాన్ని అందించింది. దీనిపై ఇస్రో ఓ ప్రకటన చేసింది. చంద్రుడి దక్షిణ ధృవంలో ఎలాంటి ఉష్ణోగ్రతలు ఉంటాయన్న దానిపై ఇప్పటివరకు ఇదే తొలి సమాచారం అని వెల్లడించింది.
Chandrayaan-3
Temperature
Surfarce
Moon

More Telugu News