Pakistan: వన్డేల్లో నెంబర్ వన్ టీమ్ గా అవతరించిన పాకిస్థాన్

Pakistan emerged as number one team in ICC ODI Rankings
  • ఆఫ్ఘన్ తో వన్డే సిరీస్ ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన పాక్
  • ఇంటా బయటా దూసుకుపోతున్న బాబర్ అజామ్ సేన
  • ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి ఐసీసీ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానానికి చేరిన పాక్
బాబర్ అజామ్ నాయకత్వంలోని పాకిస్థాన్ క్రికెట్ జట్టు వన్డేల్లో నెంబర్ వన్ గా అవతరించింది. ఐసీసీ తాజాగా ప్రకటించిన పురుషుల వన్డే జట్ల ర్యాంకింగ్స్ లో పాకిస్థాన్ అగ్రస్థానంలో నిలిచింది. 

ఆఫ్ఘనిస్థాన్ తో తాజాగా జరిగిన మూడు వన్డేల సిరీస్ ను పాక్ 3-0తో క్లీన్ స్వీప్ చేయడంతో పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి టాపర్ గా నిలిచింది. ఐసీసీ క్యాలెండర్ ఏడాదిలో పాక్ 23 మ్యాచ్ లు ఆడి 118 రేటింగ్ సాధించింది. 

బాబర్ అజామ్ కెప్టెన్సీ చేపట్టాక పాకిస్థాన్ జట్టు ఆటతీరు అనూహ్యరీతిలో మెరుగుపడింది. సొంతగడ్డపైనా, బయటా విజయాలు సాధిస్తూ ర్యాంకింగ్స్ లో పైకి ఎగబాకింది. అక్టోబరులో భారత గడ్డపై వన్డే వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో, ర్యాంకింగ్స్ లో అగ్రస్థానానికి చేరడం పాకిస్థాన్ జట్టు ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచనుంది.
Pakistan
No.1
ICC Rankings
ODI

More Telugu News