Vijay Sai Reddy: అల్లు అర్జున్‌కు అవార్డు రావడానికి నేనే కారణమని చంద్రబాబు అంటాడేమో: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యంగ్యం

YSRCP MP Vijayasai Reddy satire on Chandrababu
  • నలుగురి దృష్టిని ఆకర్షించే ఘటన ఏం జరిగినా చంద్రబాబు ఆపాదించుకుంటారన్న ఎంపీ
  • తన హయాంలో ఎర్రచందనం స్మగ్లింగ్ కొత్త పుంతలు తొక్కిందని చెబుతాడేమోనని సెటైర్
  • ఎందరో పుష్పరాజ్‌లను తయారు చేశానని చెబుతాడని ఎద్దేవా

సామాజిక అనుసంధాన వేదిక ఎక్స్ (ట్విట్టర్)లో టీడీపీ అగ్రనేతలపై సెటైర్లు విసురుతున్న వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి శనివారం సాయంత్రం మరో ట్వీట్ చేశారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు రావడానికి చంద్రబాబు నాయుడు తానే స్ఫూర్తి అని చెబుతారేమోనని ఎద్దేవా చేశారు.

నలుగురి దృష్టిని ఆకర్షించే ఘటన ఎక్కడ జరిగినా చంద్రబాబు నాయుడు దానిని తనకు ఆపాదించుకుంటారన్నారు. పుష్ప హీరో అల్లు అర్జున్ కు జాతీయ అవార్డు రావడానికి కూడా తానే స్ఫూర్తి అని అన్నా అంటాడని చురకలు అంటించారు. 'నా హయాంలోనే ఎర్రచందనం స్మగ్లింగ్ కొత్త పుంతలు తొక్కింది. ఎందరో పుష్పరాజ్‌లను నేనే తయారుచేశా. పుష్ప పార్ట్ 2 కూడా వస్తోంది తమ్ముళ్లూ' అని చంద్రబాబు బాంబు పేలుస్తాడేమో అని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News