Dharmana Prasada Rao: నేనేంటో, నా క్యారెక్టర్ ఏంటో వాళ్లే చెప్పాలి: మంత్రి ధర్మాన

Minister Dharmana opines about his character
  • శ్రీకాకుళం కత్తెర వీధిలో గడప గడపకు మన ప్రభుత్వం
  • హాజరైన మంత్రి ధర్మాన ప్రసాదరావు
  • తానెప్పుడూ ప్రజల పక్షమేనని, వాస్తవాలు మాట్లాడుతూనే ఉంటానని స్పష్టీకరణ
  • తాను భూములు దోచుకున్నానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన  

తానెప్పుడూ ప్రజల పక్షమేనని ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ప్రజల కోసం వాస్తవాలు మాట్లాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు. శ్రీకాకుళం కత్తెర వీధిలో ధర్మాన గడప గడపకు... కార్యక్రమంలో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన నోరు మూయించాలని విమర్శలు, ఆరోపణలు చేస్తుంటారని, ఎవరో భయపెడితే భయపడిపోయి వెనుకంజ వేసే రకాన్ని కాదని అన్నారు. తాను భూములు దోచుకున్నానని కూడా ప్రచారం చేశారని వెల్లడించారు. 

ధర్మబద్ధంగా పనిచేస్తుంటే తప్పు అంటున్నారని మండిపడ్డారు. 40 ఏళ్లుగా తన పంథాలో ఎలాంటి మార్పు లేదని, ప్రజల తరఫున నిజాలను నిర్భయంగా మాట్లాడుతూనే ఉన్నానని తెలిపారు. నేనేంటో, నా క్యారెక్టర్ ఏంటో నా సన్నిహితులు, ప్రజలే చెప్పాలని ధర్మాన వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News