Andhra Pradesh: మంత్రి చెల్లుబోయిన తమ్ముడిని అంటూ డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తి అరెస్ట్

Man demand money with the name of minister brother
  • హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన శ్యామ్యూల్
  • నిందితుడిని శ్రీధర్‌గా గుర్తింపు
  • అతనిపై పలు జిల్లాల్లో కేసులు ఉన్నట్లుగా గుర్తించిన పోలీసులు
ఆంధ్రప్రదేశ్ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తమ్ముడిని అంటూ ఓ వ్యక్తి ఏలూరులో పలువురి నుండి డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు. తన నుండి కూడా డబ్బులు డిమాండ్ చేయడంతో శ్యామ్యూల్ అనే వ్యక్తి హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. నిందితుడిని శ్రీధర్‌గా గుర్తించారు. అతనిపై గతంలోనూ వివిధ జిల్లాల్లో పలు కేసులు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాఫ్తు చేస్తున్నారు.
Andhra Pradesh
Minister
eluru

More Telugu News