Kuwait: కువైట్‌లో కారు ప్రమాదం.. మదనపల్లెకు చెందిన కుటుంబం దుర్మరణం!

Madanapalle Family dead in Kuwait road accident
  • కారు బోల్తా పడడంతో కుటుంబం మొత్తం మృతి
  • మృతులను గౌస్‌బాషా, ఆయన భార్య, వారి ఇద్దరి కుమారులుగా గుర్తింపు
  • ఫోన్ చేసి చెప్పిన వ్యక్తి మళ్లీ అందుబాటులోకి రావడం లేదంటున్న కుటుంబ సభ్యులు 

కువైట్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏపీలోని అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం చెందారు. మృతులను గౌస్‌బాషా (35), ఆయన భార్య (30), ఇద్దరు కుమారులుగా గుర్తించారు. 

గౌస్‌బాషా ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. రోడ్డు ప్రమాదం జరిగిన మాట నిజమేనని ఆయన బంధువులు చెబుతున్నారు. అయితే, గౌస్‌బాషా కుటుంబం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిందని చెప్పిన వ్యక్తి ఫోన్ చేస్తే మాత్రం అందుబాటులోకి రావడం లేదని, దీంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. వారి మృతదేహాలను చూసేంత వరకు నిర్ధారించలేమని చెబుతున్నారు.

  • Loading...

More Telugu News