Ambareesh: ధోనీకి చెక్ అందిస్తూ అంబరీష్... 2006 నాటి ఫొటో పంచుకున్న సుమలత

Sumalatha shares a pic that her late husband was seen presenting a cash cheque to Dhoni
  • తన భర్త అంబరీష్ ను మరోసారి స్మరించుకున్న సుమలత
  • నాడు కేఎస్ సీఏ స్టేడియంలో ఓ మ్యాచ్ సందర్భంగా ధోనీకి చెక్ బహూకరణ
  • ఇన్నాళ్లకు ఈ ఫొటో దొరికిందన్న సుమలత
  • దీని కోసం ఎన్నో ఏళ్లుగా వెదుకుతున్నానని వెల్లడి
తన భర్త, దివంగత అంబరీష్ కు సంబంధించిన ఆసక్తికర ఫొటోను సీనియర్ నటి, పార్లమెంటు సభ్యురాలు సుమలత సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ ఫొటోలో టీమిండియా క్రికెట్ దిగ్గజం ధోనీ కూడా ఉండడం విశేషం. 

"అమూల్యమైన పెన్నిధి వంటి ఈ ఫొటో ఇప్పుడు దొరికింది. ఇది 2006 నాటిది. కర్ణాటకలోని కేఎస్ సీఏ స్టేడియంలో అంబరీష్ ఓ మ్యాచ్ సందర్భంగా రూ.2 లక్షల చెక్ ను ధోనీకి బహూకరించారు. ధోనీ అప్పుడప్పుడే కెరీర్ లో పైకొస్తున్నాడు. ఆ సమయంలో ధోనీ తండ్రి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూను అంబరీష్ చూశారు. 

ధోనీ పాప్యులారిటీ పెరిగిపోతుండంతో తమ ఇంటికి వచ్చే సందర్శకుల సంఖ్య కూడా పెరిగిపోతోందని, కానీ వచ్చిన వారిని కూర్చోమని చెప్పడానికి తమ ఇంట్లో తగినన్ని కుర్చీలు కూడా లేవని ధోనీ తండ్రి చెప్పడం చూసి అంబరీష్ చలించిపోయారు. అంబరీష్ క్రీడాభిమాని... ముఖ్యంగా క్రికెట్ అంటే చాలా ఇష్టం. 

17 ఏళ్ల నాటి ఈ ఫొటో పోయిందనే అనుకున్నాం. ఎన్నో ఏళ్లుగా దీని కోసం వెతుకుతున్నాను. అనుకోకుండా ఇన్నాళ్లకు దొరికింది. ఎంతో అపురూపమైన జ్ఞాపకాలను తిరిగి అందించింది. నాకో సందేహం... ధోనీ, నీకు ఆనాటి క్షణాలు జ్ఞాపకం ఉన్నాయా?" అంటూ సుమలత ట్వీట్ చేశారు.
Ambareesh
MS Dhoni
Sumalatha
Cheque

More Telugu News